Abn logo
Sep 25 2021 @ 00:58AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ధర్మవరంరూరల్‌, సెప్టెంబరు 24: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతిచెందగా, మరొకరికి గాయాలైన సంఘటన శుక్రవా రం దర్శినమల గ్రామసమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిమిగడ్డపల్లి తూర్పుతండాకు చెందిన గోవిందునాయక్‌, కుమారుడు కార్తీ క్‌నాయక్‌ కలిసి ద్విచక్రవాహనంలో ధర్మవరం వస్తున్నారు. ధర్మవరం పట్టణం నుం చి చాంద్‌బాషా(55) మారాలకు వెళుతుండగా దర్శినమల, నడిమి గడ్డపల్లి గ్రామా ల మధ్య రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చాంద్‌బాషా,  గోవిందునాయక్‌ గాయపడ్డారు. ఇరువురిని 108 సాయంతో ధర్మవరం ప్రభుత్వాసు పత్రికి తరలించారు. చాంద్‌బాషా పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలించా రు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాంద్‌బాషా మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.