రియల్టీనష్టం రూ.లక్ష కోట్లు : కేపీఎంజీ

ABN , First Publish Date - 2020-05-22T07:07:02+05:30 IST

కరోనా సంక్షోభంతో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్ల నష్టాన్ని మూటగట్టుకునే అవకాశం ఉందని గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్వీసుల సంస్థ కేపీఎంజీ అంచనా వేస్తోంది. వచ్చే 6 నుంచి 12 నెలల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు...

రియల్టీనష్టం రూ.లక్ష కోట్లు : కేపీఎంజీ

కరోనా సంక్షోభంతో దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్ల నష్టాన్ని మూటగట్టుకునే అవకాశం ఉందని గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్వీసుల సంస్థ కేపీఎంజీ అంచనా వేస్తోంది. వచ్చే 6 నుంచి 12 నెలల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మందగించవచ్చని చెబుతోంది. అయితే కాలంలో మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉందంటోంది. నగదు కొరత నివాస గృహాల అమ్మకాల క్షీణతకు దారితీయవచ్చని, ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 2.8-3 లక్షల యూనిట్లకు తగ్గవచ్చని కేపీఎంజీ అంచనా. 


ఆఫీస్‌ స్పేస్‌కు గిరాకీ

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), బీపీఎం రంగాలు ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరగడానికి దోహదపడనున్నాయి. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పే్‌సకు గిరాకీ నిలకడగా ఉన్నప్పటికీ వచ్చే 9 నుంచి 12 నెలల కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక రియల్‌ ఎస్టేట్‌ రంగంపై 250 రకాల పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇలాంటి రంగం కరోనా మూలంగా తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇంతకు ముందు కూడా ఈ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ నిలదొక్కుకోగలిగింది. ఆర్థిక సమస్యలు కొనసాగుతుండటంతోపాటు ఊహించని విధంగా కరోనా సంక్షోభం ఏర్పడటంతో పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం పడిందని, మహమ్మారి ప్రభావానికి ఏ రంగం కూడా అతీతం కాదని కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్‌ చింతన్‌ పటేల్‌ అంటున్నారు. డేటా సెంటర్లు, ఇంటిగ్రేటెడ్‌ సప్లయ్‌ చెయున్స్‌, వేర్‌హౌసింగ్‌, సెల్ఫ్‌ సస్టేయినింగ్‌ ఇండస్ర్టియల్‌ పార్క్స్‌ తదితర రంగాల్లో అవకాశాలు లభించనున్నాయని ఆ నివేదికలో అంచనా వేశారు. 

Updated Date - 2020-05-22T07:07:02+05:30 IST