బ్రేకింగ్ : TDP కి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ABN , First Publish Date - 2021-07-17T16:28:39+05:30 IST

తెలుగుదేశం పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు...

బ్రేకింగ్ : TDP కి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

విజయనగరం : తెలుగుదేశం పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు.! ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై బై చెప్పేసి వైసీపీకి మద్దతివ్వడం.. వారి కుటుంబ సభ్యులకు కండువాలు కప్పించేశారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలు వైసీపీ కండువాలు కప్పేసుకున్నారు. అయితే తాజాగా.. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.


గతంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతి పనిచేశారు. ఇవాళ ఉదయం తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుకు పంపనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే హైమావతి కూతురు స్వాతి వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తన కూతురు పార్టీ మారితే.. తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని హైమావతి చెప్పుకొచ్చారు. హైమా రాజీనామా చేసిన తర్వాత అధికార వైసీపీలో చేరుతారా..? లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-07-17T16:28:39+05:30 IST