బైడెన్‌ బృందంలో మరో భారతీయురాలు

ABN , First Publish Date - 2020-12-01T07:02:25+05:30 IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో ఇండియన్‌-అమెరికన్‌ మహిళకు అవకాశం ఇవ్వనున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది...

బైడెన్‌ బృందంలో మరో భారతీయురాలు

వాషింగ్టన్‌, నవంబరు 30: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో ఇండియన్‌-అమెరికన్‌ మహిళకు అవకాశం ఇవ్వనున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. వైట్‌హౌ్‌సలో అత్యున్నత స్థానమైన బడ్జెట్‌, నిర్వహణ విభాగం డైరెక్టర్‌గా ఇండియన్‌-అమెరికన్‌ నీరా టాండెన్‌ ను నియమించే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే 50 ఏళ్ల టాండెన్‌ వైట్‌హౌ్‌సలో కీలక విభాగంలో పనిచేసిన తొలి మహిళగా నిలిచిపోతారు. కేబినెట్‌ స్థాయి పదవిలో పనిచేసే టాండెన్‌ ట్రిలియన్‌ డాలర్ల అమెరికా బడ్జెట్‌ నిర్వహణను చూసుకోనున్నారు. 


బైడెన్‌ కాలు చీలమండ వద్ద ఫ్రాక్చర్‌

బైడెన్‌ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా కాలు జారి చీలమండ వద్ద చిన్న ఫ్రాక్చర్‌ అయింది. ఆయన కొద్ది వారాలు వాకింగ్‌ బూట్‌ సాయం తో నడవాలని డాక్టర్లు సూచించారు. బైడెన్‌ త్వరగా కోలువాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-12-01T07:02:25+05:30 IST