Kuldeep Yadav: అంతమాత్రాన కెరియర్ ముగిసిపోదు

ABN , First Publish Date - 2021-07-20T21:13:26+05:30 IST

ఒకటి, రెండు చెత్త మ్యాచ్‌లకే కెరియర్ ముగిసిపోదని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఏడాది

Kuldeep Yadav: అంతమాత్రాన కెరియర్ ముగిసిపోదు

కొలంబో: ఒకటి, రెండు చెత్త మ్యాచ్‌లకే కెరియర్ ముగిసిపోదని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత జట్టుకు దూరమైన కుల్దీప్.. మొన్న శ్రీలంకతో కొలంబోలో జరిగిన తొలి వన్డేతో జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 9 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఓ మెయిడెన్ కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఒకటి రెండు చెత్త మ్యాచ్‌లు ఎవరికీ కెరియర్‌ను అడ్డుకోలేవని చెప్పాడు. 

Updated Date - 2021-07-20T21:13:26+05:30 IST