జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-23T10:02:12+05:30 IST

జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోగల అన్నపూర్ణ కాల నికి చెందిన మరొక వ్యక్తికి 48 రోజుల తరువాత కరోనా వైరస్‌

జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్‌

48 రోజుల తరువాత వైరస్‌

హైదరాబాద్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితుడు

కరోనా నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలింపు 

రామగుండం అన్నపూర్ణకాలనిలో కలకలం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలోగల అన్నపూర్ణ కాల నికి చెందిన మరొక వ్యక్తికి 48 రోజుల తరువాత కరోనా వైరస్‌ సోకినట్లు శుక్ర వారం నిర్ధారణ కావడంతో కలకలం రేపుతున్నది. జిల్లాలో చివరగా ఏప్రిల్‌ 6న కరోనా వైరస్‌ సోకగా, తరువాత మరొకరికి వైరస్‌ సోకడం ఇదే ప్రథమం. జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురికి మాత్రమే కరోనా వైరస్‌ సోక గా ఇద్దరిని వైద్యం అందించి డిశ్చార్జి చేసిన విషయం తెలిసిందే. తాజా గా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


రామగుండం అన్నపూర్ణ కాలనిలో నివాసం ఉండే మేడిపల్లి ఏరియా రేషన్‌ డీలర్‌ కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సదరు వ్యక్తి ఏప్రిల్‌ 29న హైదరబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లగా ఆయనకు క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారించి సర్జరీ చేశారు. వారంరోజుల తరు వాత ఆయనను డిశ్చార్జ్‌ చేయగా మియాపూర్‌లో నివాసం ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్ళాడు. రెండు రోజుల క్రితం మళ్లీ అనారోగ్యం చోటుచేసుకోవడంతో ఓమేగా ఆసుపత్రికి చేరారు. అక్కడ రెండు రోజు లుగా చికిత్స పొందుతుండగా కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో అతని రక్త నమూనాలను సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించారు.


శుక్రవారం పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో అతడిని గాంధీ ఆసు పత్రికి తరలించారు. ఆయన వెంట ఉన్న భార్య, బావమరిది తదిత రులను హైదరాబాద్‌లోని క్వారంటైన్‌ చేసి రక్తనమూనాలను సేకరించా రు. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఏప్రిల్‌ 28 కంటే ముందు కరోనా బాధితుడు ఎవరెవరిని కలిశారనే విషయమై ఆరా తీస్తున్నారు. రేషన్‌ డీలర్‌ అయిన బాధితుడు ఏప్రిల్‌ నెలలో మొదటి వారంలో మేడి పల్లి ఏరియా రేషన్‌ సరుకులను అందజేయడంతో ఆ ప్రాంతంలో ఇం టింటికి ఆరోగ్య సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.


జిల్లాలో ఏప్రి ల్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో ఒకరు మర్కజ్‌ వెళ్లి వచ్చిన అన్నపూర్ణ కాలనీకి చెందినవారు కావడంతో ఆయన ద్వారా ఇతనికి వైరస్‌ సోకిందా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీ స్తున్నారు. బాధితుడి నివాస ప్రాంతం నుంచి కిలోమీటర్‌ వరకు గల ఏ రియాను రెడ్‌జోన్‌గా ప్రకటించాలా వద్ద అనే విషయమై అధికా రులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బాధితుడు 24రోజుల క్రితమే రామ గుం డం నుంచి హైదరబాద్‌కు వెళ్లినందున అతడి ద్వారా ఇక్కడివారికి కరో నా వైరస్‌ సోకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇంటింటి ఆరోగ్య పరీక్ష లు చేపట్టడం వల్ల ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతు న్నపుడు తేలితే వారిని క్వారంటైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. 


Updated Date - 2020-05-23T10:02:12+05:30 IST