ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-06-18T06:25:48+05:30 IST

బ్యాంక్‌ ఖాతాలో జమ అయిన రైతుబంధు సాయాన్ని తీసుకునేందుకు వెళ్తున్న ఓ రైతును ఇసుక లారీ బలి తీసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో గురు వారం చోటు చేసుకుంది.

ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి
దేవయ్య మృతదేహం

- రైతుబంధు సాయం తీసుకునేందుకు వెళ్తుండగా ఘటన

- మరొకరి పరిస్థితి విషమం

- మృతదేహంతో అఖిల పక్షం ధర్నా

ముస్తాబాద్‌, జూన్‌ 17: బ్యాంక్‌ ఖాతాలో జమ అయిన రైతుబంధు సాయాన్ని తీసుకునేందుకు వెళ్తున్న ఓ రైతును ఇసుక లారీ బలి తీసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో గురు వారం చోటు చేసుకుంది. ముస్తాబాద్‌ మం డలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన  బైతి దేవయ్య (50), బైతీ కొమురయ్య  అన్నదమ్ము లు.  రైతుబంధు సాయం కోసం ముస్తాబాద్‌లోని బ్యాంకు వద్దకు ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ముస్తాబాద్‌ మీదుగా ఇసుక లోడ్‌తో అతి వేగంగా వస్తున్న లారీ తెర్లుమద్ది క్రాసింగ్‌ వద్దకు చేరుకోగానే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.  గుట్టు చప్పుడు కాకుండా దేవ య్య మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలిస్తుండగా ఘటన స్థలానికి బంధువులు, అఖిలపక్ష నాయకులు నాయ కులు యెల్ల బాల్‌రెడ్డి, రెడ్డబోయిన గోపి, గంభీరావుపేట సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్‌, గజ్జెల రాజు, కార్తీక్‌రెడ్డి, హన్మంతగౌడ్‌, భాను, రమేశ్‌, సుధాకర్‌రెడ్డి, సౌల్ల క్రాంతి, బైతీ మల్లేశ్‌లు ఽమృతదేహంతో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.  ఎంపీపీ శరత్‌రావు, సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్‌  కిషన్‌రావు లారీ యజమానులతో మాట్లాడి నష్టపరిహారం రూ 5 లక్షల చొప్పున అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. డీఎస్పీ వెంకటరమణతో పాటు, సీఐలు ఎస్సైలు, పోలీసు బలగాలు ముస్తాబాద్‌కు చేరుకొని భారీ బందోబస్తును చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయ నున్నట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-18T06:25:48+05:30 IST