బొగ్గుగనిలో ప్రమాదం.. పెద్ద బండ కింద చిక్కుకున్న కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2020-10-30T02:20:54+05:30 IST

వకీల్‌పల్లి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నవీన్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి...

బొగ్గుగనిలో ప్రమాదం.. పెద్ద బండ కింద చిక్కుకున్న కార్మికుడు మృతి

పెద్దపల్లి: వకీల్‌పల్లి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నవీన్ అనే వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు. బొగ్గుగనిలోని 41,66వ లెవల్ దగ్గర నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. ఎల్‌హెచ్‌డీ యంత్రం బొగ్గు తీస్తుండగా బొగ్గుగని పై కప్పు కూలింది. దీంతో నవీన్ పెద్ద బండ కింద చిక్కుకున్నారు. సంఘటనా స్థలాన్ని జీఎంతో పాటు అధికారులు పరిశీలించారు. మృతుడి కుటుంబానికి భారీ మొత్తంలో ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇటీవల కాలంలో గనిలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. 


Updated Date - 2020-10-30T02:20:54+05:30 IST