వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా...

ABN , First Publish Date - 2020-05-23T23:45:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.

వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా...

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియా మీట్ నిర్వహించి పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మే-25 నుంచి ప్రజల సమక్షంలో 5 రోజుల పాటు 29 వరకు ‘మన పాలన మీ సూచన’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. లబ్ది దారులు, ముఖ్యమైన నాయకులు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారితో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..? రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి..? ప్రజలు ఎలాంటి సూచనలు ఇస్తారు అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 


25 నుంచి 29 వరకు ఏమేం చేపడతారంటే..

- మొదటి రోజు 25 నుంచి పాలనా వ్యవస్థలో వచ్చిన వికేంద్రికరణ.. సచివాలయల వ్యవస్థపై చర్చిస్తాం

- 26న వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు పరిపాలనలో జరిగిన మేలు వారి నుంచి సూచనలు తీసుకుంటాం

- 27న విద్యా రంగంలో తెచ్చిన మార్పులు.. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై లబ్ధిదారులు ఎక్స్‌పర్ట్‌లతో మాట్లాడటం, సూచనలు స్వీకరణ

- 28న పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి వసతులు ఉన్నాయి.. అనేదానిపై చర్చిస్తాం, సూచనలు స్వీకరిస్తాం.. అదే విధంగా మౌలికసదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ వాటర్ గ్రిడ్‌పై సూచనలు తీసుకుంటాం.

- 29న ఆరోగ్య శ్రీలో వచ్చిన మార్పులు.. వైద్య విద్య తెచ్చిన మార్పులు, లబ్ది, కోవిడ్-19 రిలేటెడ్ అంశాలు పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటాం.

- 30 న రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.


50 మందికి మించకుండా..

జిల్లా స్థాయిలో ఇదే థీమ్‌పై జిల్లా స్థాయిలో 2:30 నుంచి 05 వరకు 50 మంది మించకుండా కార్యక్రమంను మంత్రులు నేతృత్వంలో జరుగుతాయి. ప్రతి రంగానికి వచ్చిన సూచనలు, సలహాలు ప్రజల నుంచి తీసుకుంటాం. వార్షికోత్సవం సందర్భంగా నిర్మాణాత్మకమైన కార్యక్రమంగా దీన్ని చేపడుతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడింది. హెల్త్ ఇష్యూను, కోవిడ్ దృష్ట్యా ఎక్కడ జరిగినా కార్యక్రమం అయినా 50 మందికి మించకుండా భౌతికదూరం పాటిస్తూ నిర్వహిస్తాం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’ అని విజయ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Updated Date - 2020-05-23T23:45:00+05:30 IST