అంతర్‌ జిల్లాల మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-13T11:23:28+05:30 IST

అంతర్‌ జిల్లాల మో టారుసైకిళ్ల దొంగను అరెస్ట్‌ చేసి అతని వద్ద 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నె ల్లూరులో నివాసం ఉంటున్న కరేడు గ్రామానికి చెందిన నిందితుడు మాబుసుభానిని ఉల వపాడు పోలీ

అంతర్‌ జిల్లాల మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌

12 వాహనాలు స్వాధీనం


కందుకూరు, ఆగస్టు 12 : అంతర్‌ జిల్లాల మో టారుసైకిళ్ల దొంగను అరెస్ట్‌ చేసి అతని వద్ద 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నె ల్లూరులో నివాసం ఉంటున్న కరేడు గ్రామానికి చెందిన నిందితుడు మాబుసుభానిని ఉల వపాడు పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల 12 మోటారు సైకిళ్లను దొంగతనం చేసినట్లు అతను అంగీకరించాడు. స్థానిక సబ్‌ డివిజన్‌ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ  శ్రీనివాసరావు మాట్లాడారు. స్థానిక పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇటీవలికాలంలో వరుస మోటారు సైకిళ్ల చోరీ అవుతున్న నేపథ్యంలో గ తంలో ఈ తరహా కేసులో ఉన్న మాబుసుభాని కదలి కలపై కన్నేశారు.


కానిస్టేబుల్‌ కిషోర్‌ ఓ మోటారు సైకిల్‌ కొంటానని ఫోన్‌ చేసి అడగ్గా, కరేడు ర్యాంపు వద్దకు రావాలని మాబుసుభాని చెప్పాడు. అక్కడ మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ దేవకుమార్‌, ఇతర సిబ్బంది నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సుభాని నాయనమ్మ ఇంట్లో 12 మోటారు సైకిళ్లు లభించాయి. వీటిల్లో ఐదు స్థానిక పోలీసుస్టేషన్‌ పరిధిలోనివి కాగా, మిగతావి ఒంగోలు తాలూకా, దర్శి, ఒంగోలు టౌన్‌, నె ల్లూరు జిల్లా కోవూరు పోలీసు స్టేషన్‌ పరిఽ దిలో నివి. సమావేశంలో ఎస్‌ఐలు దేవ కుమార్‌, సీహెచ్‌. హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T11:23:28+05:30 IST