నిబంధనలు బేఖాతర్‌

ABN , First Publish Date - 2020-09-23T09:47:42+05:30 IST

: స్థానిక నగర పంచాయతీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతున్నా లాక్‌డౌన్‌ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు

నిబంధనలు బేఖాతర్‌

 కనిగిరి నగర పంచాయతీలో 

     అమలుకాని కొవిడ్‌ ఆంక్షలు

 సాయంత్రం 8 గంటల వరకు 

     షాపుల నిర్వహణ రోడ్లపై యథేచ్ఛగా

     తిరుగుతున్న ప్రజలు

 పట్టించుకోని పోలీసులు


కనిగిరి, సెప్టెంబరు 22: స్థానిక నగర పంచాయతీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరుగుతున్నా లాక్‌డౌన్‌ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.


మంగళవారం పట్టణంలో వ్యాపారులు ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా సాయంత్రం వరకు అన్ని షాపులు తెరిచి వ్యాపారాలు నిర్వహించారు. కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో కనిగిరికి వచ్చి సాయంత్రం వరకు వస్తువులు కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు. ఏ షాపులోనూ భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు లేవు. పోలీసులు మొక్కుబడిగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నారే కానీ నిభందనల అమలుపై దృష్టి సారించక పోవడం వలన కరోనా బాదితులు మరింత పెరిగే అవకాశం ఉంది.


పరీక్షల్లో సగం మందికి కరోనా

నాలుగు రోజులుగా స్థానిక ప్రభుత్వ ఏరి యా వైద్యశాలలో నిర్వహించే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి... ఈ నెల 16న 56 మందికి పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్‌ పరీక్షల్లో 15 మందిలో 9 మందికి కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యింది. 17న 39 మందికి పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్‌లో 8 మందిలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. 18న 31 మందికి పరీక్షలు చేయగా ర్యాపిడ్‌లో 9 మందిలో నలుగురికి కరోనా సోకింది. 19న 16 మందికి పరీక్షలు నిర్వహించారు.


అదే విధంగా ఈ నెల 21న 30 మందికి పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్‌ పరీక్షల్లో 9 మందిలో ఐదుగురికి, 22న 14 మందికి పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్‌లో 11 మందిలో ఆరుగురు కరోనా బారిన పడ్డారని డాక్టర్‌ స్రవంతి చెప్పారు. దీనిని బట్టి చూస్తే ర్యాపిడ్‌ పరీక్షల్లో సగం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. ట్రూనాట్‌, వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో వారం రోజుల గడువు పడుతుండడంతో ఆ వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-09-23T09:47:42+05:30 IST