లక్ష్యాల మేరకు రుణాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-29T11:32:39+05:30 IST

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణ పంపీణీ చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సో మవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశం మందిరంలో జరిగిన బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడారు

లక్ష్యాల మేరకు రుణాలు ఇవ్వాలి

 బ్యాంకర్లకు 

 ఎంపీ మాగుంట సూచన

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 28: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణ పంపీణీ చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సో మవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశం మందిరంలో జరిగిన బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమా వేశంలో ఆయన మాట్లాడారు.  వర్షాలు అధికంగా కురుస్తున్నందున పంటలు సాగు కోసం రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాన్నారు. భూమి ఉన్న రైతుల తో పాటు కౌలు రైతులకు రుణం ఇచ్చేలా చూడా లని ఆయన సూచించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు రుణప్రోత్సాహం అందించా లన్నారు.  వీధి వ్యాపారులు వ్యాపార అభివృద్ధికి రుణం సదు పాయం కల్పించాలన్నారు.



కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ స్టాండ్‌ ఆ ఫ్‌ ఇండియా  కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదా రులతోపాటు మహిళలకు రూ.10లక్షలు నుంచి రూ.కోటి వరకు రుణాలు ఇవ్వాలన్నారు. 11 బ్యాంకు లకు సంబంధించిన బ్యాంకు అధికారులు కనీసం ఒకరికి రుణం ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకంలో నేటికి 48వేల మందికి జన్‌ధన్‌ ఖాతాల లేకపోవడంపై ఆయన ఆరా తీశారు. వైఎస్‌ఆర్‌ చేయూత రుణాలు లక్ష్యం మేరకు ఇవ్వాలన్నారు.


పరిశ్రమల ఏర్పాటుకు పీఎంఈజీపీ పథకం కింద లబ్ధిదారులకు అందించా లన్నారు. వివిధ కార్పొరేషన్ల కింద ప్రభుత్వం మం జూరు  చేసిన రాయితీ సొమ్ము రూ.42.50 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్యాంకులలోనే పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. వీటిని 15 రోజుల్లో లబ్ధిదారులకు యూనిట్లు ద్వారా గ్రౌండిగ్‌ చేయాలన్నారు. లేకుంటే ఆ నగదును  ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.


కందుకూరు ఎమ్మెల్యే మానగుంట మహీ ధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధి కో సం నాబార్డు ద్వారా బహుళ ప్రయోజన నిధి లక్ష్యాలను నిర్దేశించిన మేరకు పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించటం మంచి పద్ధతి కాదన్నారు.  కందుకూ రు నియోజకవర్గంలో 30 కి.మీ మేర తీరప్రాంతం మైరన్‌ షిప్పింగ్‌ తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం పది శాతం ప్రాంతంలో మత్సకారులు వేట నిర్వహిస్తు న్నారన్నారు. చీరాల ప్రాంతంలో చేనేత కార్మికులను తప్పమిగిలిన ప్రాంతాల్లోని ఆవృత్తిలోని ఉన్నవారిని విస్మరిస్తున్నారన్నారు. అందరిని సమానంగా చూసి ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాలని మహీధర్‌ రెడ్డి సూచించారు. 


సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి, డీఆర్వో కె.వినాయకం, ఎల్‌డీఎం యు గంధర్‌రెడ్డి, 'నాబార్డు డీడీ వెంకటరమణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-29T11:32:39+05:30 IST