Abn logo
Oct 30 2020 @ 05:50AM

జగన్‌ది అణచివేత పాలన

 దళిత నేత నీలం నాగేంద్ర ధ్వజం


కనిగిరి, అక్టోబరు 29 :  మేలు చేస్తారని నమ్మి ఓట్లు వేసిన దళితులపై జగన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాతో అణచివేత పాలన సాగిస్తున్నారని దళిత హక్కుల పరి రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపిం చారు. దళిత సంఘ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన దళితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాలు రద్దు చేసి సీఎం పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు.  బ్రాహ్మణ, కాపు కార్పొ రేషన్‌లకు ఆర్థిక సంఘం అనుమ తితో నిధులు కేటా యించి బీసీలకు కేవలం కార్పొరేష న్‌ పదవులిచ్చి నిధులు మాయ చేశారని నీలం వి మర్శించారు. స మావేశంలో మా ల మహానాడు జి ల్లా అధ్యక్షుడు  అంజయ్య, వెం కట్రావు, భాస్క ర్‌, విద్యాసాగర్‌, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.