ఓఎన్జీసీ ట్యాంకర్‌కు మళ్లీ బ్రేకులు..!

ABN , First Publish Date - 2022-01-24T06:28:12+05:30 IST

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ ప్లాంటుకు వెళ్తున్న భారీ వాహనాలకు ఇంకా బ్రేకు లు పడుతూనే ఉన్నాయి. రవాణా ఆటంకాలపై అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఓఎన్జీసీ ట్యాంకర్‌కు మళ్లీ బ్రేకులు..!
అల్లవరం మండలం ఓడలరేవులో నిలిచిన ఓఎన్జీసీ ట్యాంకురు

అల్లవరం, జనవరి 23: అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ ప్లాంటుకు వెళ్తున్న భారీ వాహనాలకు ఇంకా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. రవాణా ఆటంకాలపై అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఢిల్లీలో బయలుదేరిన భారీ ట్యాంకర్లు నేటికీ ఓడలరేవు ప్లాంటుకు చేరలేదు. మా స్థలాల పక్కనుంచి మీ వాహనాలు వెళ్తున్నందుకుగాను.. మాకేంటి.. అంటూ.. ఓడలరేవులో రోడ్డు పక్కన కర్రలు పాతి.. దడులు కట్టి ఆటంకాలు కల్పిస్తున్నారంటూ అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఒకరిద్దరి స్థలాల కు నష్టపరిహారం చెల్లించడానికి టాటా అధికారులు గ్రామం లో చర్చలు జరిపారు. 120 చక్రాల భారీట్యాంకర్లు ఢిల్లీనుంచి రావులపాలెం చేరుకున్నట్టు సమాచారం. స్థల అడ్డంకు లు, అడుగడుగునా ధర్నాలు మధ్య భారీట్యాంకర్లకు బ్రేకులు పడుతున్నాయి. కాగా, ఓడలరేవులో ట్యాంకర్లను మంగళవా రం తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-24T06:28:12+05:30 IST