దాల్ మిల్లుల‌పై కొనసాగుతున్న దాడులు

ABN , First Publish Date - 2021-04-07T20:54:42+05:30 IST

నగరంలో రెండో రోజు కూడా దాల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

దాల్ మిల్లుల‌పై కొనసాగుతున్న దాడులు

విజయవాడ: నగరంలో రెండో రోజు కూడా దాల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. భవానీపురం, గొల్లపూడిలోని పలు అయిల్,  పప్పు మిల్లులపై దాడులు నిర్వహించారు. పెసరపప్పు, కందిపప్పు శాంపిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలు కలిసి సంయుక్తంగా నాలుగు బృందాలతో దాడులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కందిపప్పు, పెసరపప్పులో కలర్స్ కలిపి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. మహేశ్వరి, వెంకటదుర్గ, కంపెనీల దాల్ మిల్లులపై తనిఖీలు చేశామన్నారు. దాదాపు 15 లక్షల విలువ చేసే పెసరపప్పును సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. 




 కందిపప్పు, పెసరపప్పు శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్‌‌ను బట్టి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కలర్స్ కలిపిన పప్పులు తింటే అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలు ఎవరు చేపట్టినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచంద్రరావు  హెచ్చరించారు.

Updated Date - 2021-04-07T20:54:42+05:30 IST