కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2021-05-17T05:36:06+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవఽధిలో మరో 1638 మంది వైరస్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటినలో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,153కి చేరుకుంది.

కొనసాగుతున్న కరోనా ఉధృతి

1638 పాజిటివ్‌ కేసులు నమోదు

ఇద్దరు మృతి

కడప, మే 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల వ్యవఽధిలో మరో 1638 మంది వైరస్‌ బారిన పడ్డట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటినలో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,153కి చేరుకుంది. మరో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు 589 మందిని కరోనా కాటేసింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 1265 మందిని డిశ్చార్జి చేశారు. రికవరీ సంఖ్య 71,350కి చేరింది. మండలాల వారీగా  నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.. 

జిల్లాలో 49 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కడపలో 291, రైల్వేకోడూరు 97, ఓబులవారిపల్లె 85, రాజంపేట 80, ప్రొద్దుటూరు 72, పులివెందుల 64, నందలూరు 59, బద్వేలు 50, మైదుకూరు 47, సిద్దవటం 46, పోరుమామిళ్ల 44, జమ్మలమడుగు 44, రామాపురం 41, ఖాజీపేట 36, రాయచోటి 33, బి.కోడూరు 31, దువ్వూరు 31, చిట్వేలిలో 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే చాపాడు 29, గాలివీడు 28, టి.సుండుపల్లె 27, బి.మఠం 26, ఎల్‌ఆర్‌పల్లె 26, చక్రాయపేట 22, సంబేపల్లె 22, లింగాల 22, పెనగలూరు 21, కమలాపురం 20, చెన్నూరు 20, ఒంటిమిట్ట 21, కలసపాడు 17, రాజుపాలెం 16, సీకేదిన్నె 16, వీరబల్లె 16, సింహాద్రిపురం 14, మైలవరం 13, చిన్నమండెం 11,  పుల్లంపేట 10, తొండూరు 10, ఎర్రగుంట్ల 10, కొండాపురం 8, అట్లూరు 7,  పెద్దముడియం 5, గోపవరం 4, పెండ్లిమర్రి 4, ముద్దనూరు 3, కాశినాయన 2, వల్లూరు 2, వేముల 2, వీఎనపల్లె 1, అదర్‌ డిసి్ట్రక్ట్‌ 2 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-17T05:36:06+05:30 IST