కొనసాగుతున్న కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-08-13T09:57:36+05:30 IST

కరోనా వైరస్‌ ఉధృతి ఆగటం లేదు. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 773 మంది కరోనా బారిన

కొనసాగుతున్న కరోనా ఉధృతి

ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 773 కేసులు నమోదు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా వైరస్‌ ఉధృతి ఆగటం లేదు. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 773 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 485, మేడ్చల్‌ జిల్లాలో 270 కేసులు నమోద య్యాయి. మేడ్చల్‌ డీఐఈవో భాస్కర్‌ కరోనాతో మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడుజిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,839కి చేరింది. 


ఆమనగల్లులో రెండు కేసులు

ఆమనగల్లు : ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రిలో బుధవారం 14 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో ఆమనగల్లుకు చెందిన ఒకరికి, కడ్తాలకు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో బుధవారం 296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 34మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిలో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన వారు ఆరుగురు ఉండగా, కొత్తూర్‌ మండలానికి చెందిన వారు 13 మంది ఉన్నారని, మిగతా 15 మంది ఇతర మండలాలకు చెందిన వారున్నట్లు వివరించారు. 


పట్నం డివిజన్‌లో 38 మందికి..

ఇబ్రహీంపట్నం / యాచారం : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో బుధవారం 193 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 38 మం దికి పాజిటివ్‌ అని తేలింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీలో 94 మందికి పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇబ్ర హీంపట్నంలో 24 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.


దండుమైలారం పీహెచ్‌సీలో 8 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, మంచాల పీహెచ్‌సీలో 10మందికి పరీక్షలు చే యగా ఒకరికి, ఆరుట్ల పీహెచ్‌సీలో 11 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఎలిమినేడు పీహెచ్‌సీలో 8 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, మాడ్గుల పీహెచ్‌సీలో 17 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి, ఇర్విన్‌లో ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. యాచారంలో 14 మందికి పరీక్షలు చేయగా శేరిగూడకు చెందిన ఒకరికి పాజిటివ్‌గా వచ్చింది.


కరోనాతో పట్నంలో ఒకరి మృతి

ఇబ్రహీంపట్నం టౌన్‌ ప్రగతినగర్‌ కాలనీలో బుధవారం సాయంత్రం 45 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. పాజిటివ్‌ రావడంతో మూడు రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కాగా బుధవారం సాయంత్రం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి చెందాడు.


కందుకూరులో ఎనిమిది మందికి..

కందుకూరు : కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎనిమిది మందికి పాజిటివ్‌గా నమోదైంది.


చేవెళ్ల మండలంలో..

చేవెళ్ల : చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం  23 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. 


శంషాబాద్‌లో నాలుగు కేసులు 

శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపాలిటీలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి : వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం వికారాబాద్‌లో 5, తాండూరులో 5, కొడంగల్‌లో 3, యాలాల్‌లో 2, బషీరాబాద్‌, బంట్వారం, దోమ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు 550 మందికి కరోనా పరీక్షలు.. 120 మందికి పాజిటివ్‌

తాండూరు : కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించేందుకు తాండూ రులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని 3వ ఫ్లోర్‌లో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఐసోలేషన్‌లో ఓ గర్భిణికి పాజిటివ్‌ రాగా, ఆమెకు చికిత్స అందించి ప్రసూతి చేశారు. ఇప్పటివరకు ప్రతిరోజూ 30చొప్పున 550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 120 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తు న్నారు. ఇదిలాఉంటే జిల్లా ఆస్పత్రికి 100 కరోనా పరీక్షల కిట్స్‌ రావడం వల్ల.. ఇవి ఏ మాత్రం చాలడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-08-13T09:57:36+05:30 IST