హెచ్ఎండీఏ పరిధిలో కొనసాగుతోన్న కూల్చివేతలు

ABN , First Publish Date - 2022-01-26T00:38:26+05:30 IST

హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

హెచ్ఎండీఏ పరిధిలో కొనసాగుతోన్న కూల్చివేతలు

హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతోన్నాయి.  తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సెంచరీ దాటాయి. మంగళవారం రెండు మున్సిపాలిటీల పరిధిలో ఐదు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గుండ్లపోచంపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలో టాస్క్‌ఫోర్స్ ఆధ్యర్యంలో కూల్చివేతలు జరిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 600 చదరపు గజాలకు మించిన అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు చర్యలు చేపట్టాయి. హెచ్ఎండీఏ, జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్స్ సంయుక్తంగా అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తు్న్నాయి. మంగళవారంతో వంద అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2022-01-26T00:38:26+05:30 IST