కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి

ABN , First Publish Date - 2022-01-18T04:29:34+05:30 IST

కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి

కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి
ఆమనగల్లులో కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బంది

చేవెళ్ల/ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు/యాచారం/మాడ్గుల: కొవిడ్‌ ఉధృతి కొనసాగుతోంది. చేవెళ్ల డివిజన్‌ పరిధిలో సోమవారం 350 మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా 83మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో  103మందికి గానూ 34, శంకర్‌పల్లిలో 84 మందికి గానూ 21,  షాబాద్‌లో 66మందికి గానూ 12మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే మొయినాబాద్‌ మండలంలో 97మందికి గానూ 16మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో సోమవారం 9 కేంద్రాల్లో 691 మందికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 77 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇబ్రహీంపట్నంలో 171 మందికి గానూ 24, అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 114 మందికిగానూ 28, యాచారంలో 70 మందికి గానూ ఐదుగురికి, మంచాలలో 53 మందికిగానూ ఇద్దరికి, దండుమైలారంలో 51 మందికి గానూ  ముగ్గురికి, ఎలిమినేడులో 74 మందికిగానూ 11, మాడ్గులలో 58 మందికిగానూ ముగ్గురికి, ఇర్విన్‌లో 50 మందికిగానూ ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 86 మందికి గానూ 29మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ ఫాతిమా, ఎంఫీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి, ఏఎన్‌ఎం లక్ష్మి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. అదేవిదంగా కడ్తాల మండలం మైసిగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ అజీం, ఎంపీహెచ్‌ఈవో ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. తలకొండపల్లిలో 33మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ శారద తెలిపారు. గట్టిప్పలపల్లిలో 56 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ అజీం తెలిపారు. అదేవిధంగా మాడ్గులలో 105మందికి కొవిడ్‌ టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ లలిత తెలిపారు. 

నలుగురు కానిస్టేబుళ్లకు కొవిడ్‌ పాజిటివ్‌ 

యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 70మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురు కరోనా బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. వారిలో స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లతో పాటు వనస్తలిపురంనకు చెందిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.  

Updated Date - 2022-01-18T04:29:34+05:30 IST