కొనసాగుతున్న లాక్‌డౌన

ABN , First Publish Date - 2021-05-14T07:18:28+05:30 IST

కరోనా కట్టడికి ప్ర భుత్వం విధించిన లాక్‌డౌన కొనసాగుతోంది. ఉదయం నిత్యావసరాల కోసం కోదాడ పట్టణవాసులు గురువారం రోడ్డెక్కారు.

కొనసాగుతున్న లాక్‌డౌన
సూర్యాపేటలో జనంతో కిటకిటలాడుతున్న సంత

 నిత్యావసరాలకోసం ఉదయమే రోడ్డెక్కిన జనం 
 నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు

కోదాడటౌన్‌/ తిరుమలగిరి/ హుజూర్‌నగర్‌/ మఠంపల్లి/ మేళ్లచెర్వు/ పాలకవీడు/ గరిడేపల్లి రూరల్‌/ నడిగూడెం/ అర్వపల్లి, మే 13:
కరోనా కట్టడికి ప్ర భుత్వం విధించిన లాక్‌డౌన కొనసాగుతోంది. ఉదయం నిత్యావసరాల కోసం కోదాడ పట్టణవాసులు గురువారం రోడ్డెక్కారు. దీంతో రహదారులన్నీ వాహనదారులతో కిటకిటలాడాయి. వాహనాల రద్దీ అధికంగా ఉం డటంతో పెద్ద మసీద్‌ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. రెండోరోజు పట్టణంలో ప్రశాంతంగా లాక్‌డౌన్‌ కొనసాగింది. పది గంటల తర్వాత ప్ర భుత్వం మినహాయింపు ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు రోడ్లపైకి అనుమతించారు. పట్టణ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో పోలీసులు కొవిడ్‌ నింబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. మ ధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. తిరుమలగిరి మండలం లోని వెలిశాల, తొండ గ్రామాల్లో కిరాణ షాపులు నడిచాయి. అధికారులు పర్య వేక్షించి లాక్‌డౌన పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కస్తాల శ్రావణ్‌ కోరారు. 11వ వార్డులో జరిగిన సమావేశంలో మాట్లాడారు. టెస్ట్‌లు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. లాక్‌డౌనకు ప్రజలు సహకరించాలని మఠ ంపల్లి ఎంపీపీ ముడావత పార్వతి కొండానాయక్‌ కోరారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. ఉపా ధిహామీ పథకంపై మండల పరిషత కార్యాలయంలో సమీక్ష నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో మామిడి జానకిరాములు, ఏపీవో ఉమా పాల్గొన్నారు. అనుమతి లేకుండా వంతెనపై రావొద్దని మఠంపల్లి ఎస్‌ఐ ఎల్లయ్య అన్నారు. మట్టపల్లి వంతెన పోలీసులు బందోబస్తు నిర్వహి స్తున్నారు. ఏపీ నుంచి అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమ తిచ్చారు. మేళ్లచెరువు మండలంలో పోలీసులు నిఘా పెంచారు. ఉద యం 10గంటల తర్వాత అన్ని గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసు కున్నారు. పాలకవీడు మండలంలోని బెట్టెతండాలో శానిటైజర్‌ మమ్ము రం చేశామని సర్పంచ్‌ మోతీలాల్‌ తెలిపారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో సర్పంచ కీతా జ్యోతి రామారావు వీధుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెండెం ధనమూర్తి పాల్గొన్నారు. లాక్‌డౌనను ఉల్లం ఘించిన 21మందిపై కేసు నమోదు చేసినట్లు నడిగూడెం ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. మాస్క్‌లు ధరించని వారిపై 3, లాక్‌డౌన ఉల్లంఘ నకు సంబంధించి 18మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నడిగూ డెం మండలంలోని వేణుగోపాలపురం, వల్లపురం, నడిగూడెంలో సర్పంచులు స్వరూప వెం కన్న, వట్టికూటి చంద్రయ్య, గడ్డం నాగలక్ష్మీ మల్లేష్‌యాదవ్‌ పారి శుధ్య పనులు చేపట్టారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, హైపోకోర్లిన ద్రావ ణాన్ని పిచికారీ చేయించారు. అర్వపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీ క్ష సమావేశంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్‌ మా ట్లాడా రు. 45సంవత్సరాలు నిండిన వారంతా కరోనా వ్యాక్సిన్‌ టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, ఎంపీడీవో ఉమేష్‌ పాల్గొన్నారు.
కోవాగ్జిన అందక ప్రజలు ఇబ్బందులు
కోదాడరూరల్‌:
కోవాగ్జిన టీకా తీసుకొని రెండునెలలు దాటినా ఇంతవరకు రెండో డోసు వేయలేదని బాధితులు వాపోతున్నారు. తీవ్ర ఆందోళన చెందుతున్నామని, మొదట ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కోవ్యాక్సిన సరఫరా చేయగా ఆ టీకా తీసుకున్నామన్నారు. ప్రభుత్వం నుంచి కో వ్యాక్సిన సరఫరా ఆగిపోయిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారని చెబుతున్నారు. రెండు నెలలుగా కో వ్యాక్సిన రాకపో వటంతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ రోజు తిరుగుతున్నారు. మండలం లోని పలు గ్రామాల ప్రజలు కోవ్యాక్సిన టీకా తీసుకున్నారు.

Updated Date - 2021-05-14T07:18:28+05:30 IST