కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-06-23T09:14:28+05:30 IST

‘సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపీ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల

కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన

కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన


గుంటూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపీ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉద్యోగుల ఆందోళనకు ఆయా ప్రాంతాల్లో అసోసియేషన్‌ నేతలు దమ్ము సింహాచలం(శ్రీకాకుళం), సీహెచ్‌ నాగరాజు(చిత్తూరు), లావణ్య(పశ్చిమగోదావరి), కమలాకర్‌(అనంతపురం), మోహన్‌(ఏలూరు), భానూజీరావు(గుంటూరు) నాయకత్వం వహించారు. గుంటూరులో గురువారం జేఏసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు.

Updated Date - 2021-06-23T09:14:28+05:30 IST