లాక్‌డౌన్‌కు 52 రోజులు

ABN , First Publish Date - 2020-05-14T09:58:06+05:30 IST

కరోనావైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ విధించి 52రోజుల అవుతోంది. విద్య, రవాణా, హోటళ్లు, కొన్ని రం గాలు మినహా ప్రభుత్వం మిగతావాటికి సడ

లాక్‌డౌన్‌కు 52 రోజులు

ప్రభుత్వ కార్యాలయాలకు జనం తాకిడి

భౌతిక దూరంపై నిర్లక్ష్యం 

మాస్క్‌లు లేకుండా రోడ్లపైకి 

జరిమానా విధిస్తున్నా పట్టని వైనం  

కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు

వలసలతో భయం

జిల్లాలో హోం క్వారంటైన్‌లో 1415 మంది


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కరోనావైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ విధించి 52రోజుల అవుతోంది. విద్య, రవాణా, హోటళ్లు, కొన్ని రం గాలు మినహా ప్రభుత్వం మిగతావాటికి సడ లింపులు ఇచ్చింది. నిత్యావసరాలు, బట్టల దుకా ణాలు, సెలూన్లు, సెల్‌షాపులు, ఇతర దుకాణాలు 50 శాతం తెరచుకునే అవకాశం కల్పించింది. సరి బేసి సంఖ్యలో దుకాణాలను రోజు విడిచి రోజు తెరు స్తున్నారు. దీంతో జనం ఒక్కసారిగా రోడ్లపైకి వస్తు న్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల తాకిడి పెరిగింది. ఉద్యోగులందరూ విధులకు హాజరవు తుండడంతో వివిధ అవసరాల రీత్యా ప్రజలు వ స్తున్నారు. కార్యాలయాల వద్ద శానిటైజేషన్‌ వంటి చర్యలు చేపట్టారు.


లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు ఉల్లంఘిస్తున్నారు భౌతిక దూరం పాటించడం విస్మ రిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపైకి వస్తు న్నారు. మున్సిపల్‌ అధికారులు దుకాణదారులకు, ప్రజలకు జరిమానాలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉదయం కూరగాయల మార్కెట్‌లో కనీస దూరం  పాటించడం లేదు. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న సిరిసిల్ల గ్రీన్‌జోన్‌ దిశగా వెళ్తోంది. గ్రీన్‌ జోన్‌లోకి మారితే మరిన్ని సడలింపులు రానున్నాయి. దీంతో పూర్తిగా కంట్రోల్‌ తప్పుతుందని భావిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తని ఖీలు చేస్తున్నా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఉన్నా అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారు ఆగడం లేదు.  ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ, ఎస్సైలు తనిఖీలు చేప డుతున్నా రద్దీ  కనిపిస్తోంది. 


వలసలతో భయం 

రాకపోకలపై కొంత సడలింపులు ఇవ్వడంతో జిల్లా నుంచి వలస కార్మికులు స్వస్థలాలకు  వెళ్తు న్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సిరిసిల్లకు చెందిన వా రు జిల్లాకు చేరుకుంటున్నారు. వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 1415 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతీ రోజు వంద మంది జిల్లాకు చేరుకుంటున్నారు. వలసలతో కరోనా మళ్లీ ఎక్కడ వ్యాప్తి చెందు తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2020-05-14T09:58:06+05:30 IST