శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2021-10-12T02:28:13+05:30 IST

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద వస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

శ్రీశైలం: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద వస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి వరద పెరగడంతో డ్యాం 4 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, సుంకేసుల. హంద్రీ నుంచి 1,79,728 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.8450 టీఎంసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,066 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 33,549 క్యూసెక్కులు, డ్యాం క్రస్టుగేట్ల ద్వారా 1,11,932 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-10-12T02:28:13+05:30 IST