కొనసాగుతున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-24T06:12:59+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
త్యాగరాజస్వామి ఉత్సవాల్లో భక్తి సంగీతం వినిపిస్తున్న కళాకారులు

వేములవాడ టౌన్‌, జనవరి 23 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటలకు వెల్ది నరసింహమూర్తి హరకథ, ఉదయం 10 గంటలకు విజయుడు, భాగవతార్‌తో హరికథ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చేపట్టిన భక్తి సంగీతం, దూలిపాలి శ్రీనివాస్‌తో ఏర్పాటు చేసిన వయోలిన్‌ ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2022-01-24T06:12:59+05:30 IST