కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2020-10-24T11:24:02+05:30 IST

ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదా యిని శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి 12గేట్ల ద్వారా 37 వేల 500క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్టు ప్రా జెక్టు ఈఈ రామారావు తెలిపారు

కొనసాగుతున్న నీటి విడుదల

మెండోర, అక్టోబరు23: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదా యిని శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి 12గేట్ల ద్వారా 37 వేల 500క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్టు ప్రా జెక్టు ఈఈ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 25 వేల 359క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావ డంతో నాలుగు గేట్ల ద్వారా 12 వేల 500వేల క్యూసెక్కుల నీటి ని గోదావరిలోకి విడుదల చేశారు. గంట వ్యవధిలోనే ప్రాజెక్టు లోకి 31వేల609క్యూసెక్కుల వరద పెరగడంతోఆరు గేట్ల ద్వారా 18వేల750క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్న ట్టు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. సాయంత్రం ప్రాజె క్టులోకి ఇన్‌ఫ్లో 50 వేల 359క్యూసెక్కులు పెరగడంతో 12గేట్ల ద్వారా 37వేల 500క్యూసెక్కుల మిగులు జలాలను గోదా వరిలోకి విడుదల చేశారు. ప్రా జెక్టు నుంచి ఎస్కెప్‌ ఐదు గేట్ల ద్వారా 55 00క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తూ కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూ సెక్కులు, సరస్వతి కాలు వకు 500 క్యూసె క్కులు, లక్ష్మీకాలువకు 150క్యూసెక్కులు, వర దకాలువకు 3000క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు వివ రించారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 525క్యూ సెక్కులు, మిషన్‌ భగీరథకు 152క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతుం దని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091అడుగులు (90టీఎంసీ)లు శుక్రవారం సాయంత్రానికి 1091అడుగులు (90 టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని తెలిపారు.  


జెన్‌కోలో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి..

శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 3000 క్యూ సెక్కుల ఎస్కేప్‌ గేట్ల ద్వారా 5500వేల క్యూసెక్కుల నీటి విడు దల కొనసాగుతుండడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో టర్బయి న్‌ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని జెన్‌కో డీఈ శ్రీనివాస్‌ తెలిపారు. నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36.3 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.

Updated Date - 2020-10-24T11:24:02+05:30 IST