Abn logo
Sep 26 2021 @ 23:58PM

ఎల్‌ఎండీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

జలాశయం నుంచి విడుదలవుతున్న నీరు

 తిమ్మాపూర్‌, సెప్టెంబరు 26: కరీంనగర్‌ పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎల్‌ఎండీ పూర్తిస్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 23.645 టీఎంసీల నిల్ల ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోయతుమ్మెద వాగు నుంచి 8,327 క్యూసెక్కులు ఎల్‌ఎండీలోకి వస్తున్నాయి. ఆరు గేట్ల ద్వారా 12,030 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.