సెంచరీ కొట్టిన ఉల్లి

ABN , First Publish Date - 2020-10-24T11:40:00+05:30 IST

ఎడ తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు ఉల్లి మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. దిగుబ డులు లేకపోవడంతో కిలో ఉల్లి ఏకంగా రూ.100 కు చేరింది.

సెంచరీ కొట్టిన ఉల్లి

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 23 : ఎడ తెరిపి లేకుండా కురిసిన  భారీ వర్షాలు ఉల్లి మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. దిగుబ డులు లేకపోవడంతో కిలో ఉల్లి ఏకంగా రూ.100 కు చేరింది. సాధారణంగా ఈ రోజుల్లో వందల సంఖ్యలో వచ్చే ఉల్లి లారీలు ఇప్పుడు పదికి పడి పోయింది. మూడు రోజుల క్రితం రూ.70కి చేరిన ఉల్లి ప్రస్తుతం రూ.100కి విక్రయిస్తున్నా రు. ఉల్లి ధర డబుల్‌ సెంచరీ రూ.200 చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు చెబుతు న్నారు. దీనికి కారణం సాధారణంగా కర్నూలు, మహారాష్ట్రల నుంచి ఉల్లి దిగుబడి అవుతుంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలకు పెద్ద సంఖ్యలో ఉల్లి సాగు కుదేలైంది. దీంతో ఉల్లి దిగుమతి మందగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధార ణంగా రెండు కిలోలు తీసుకునే వినియోగ దారుడు అత్యవసరమైతే తప్ప ఉల్లి కొనుగోలుకు సాహసించడం లేదు. 


ఉల్లిపాయలు ఏటా అక్టోబరు, నవంబరు నెల ల్లో వందల  సంఖ్యలో లారీల ఉల్లి ఇబ్బడి ము బ్బడిగా వచ్చి పడుతుండేవి. కానీ ప్రస్తుతం వేళ్ళ తో లెక్కపెట్టే విధంగా ఉల్లి దిగుమతి అవుతు న్నది. దీనికి కారణం ఇటీవల ఎడతెరిపి లేకుం డా కురిసిన వర్షాలకు కర్నూలు, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉల్లి పంట నాశనమైంది. దీంతో అక్క డ కుళ్లిన ఉల్లి రోడ్ల పక్కనే పడేస్తున్నారు. మరి కొందరు రైతులు చేలల్లోనే ఉల్లి పంట వదిలేస్తు న్నారు. మరో 20 రోజులు ఇదే విధంగా ఉల్లి ధర కొనసాగుతుందని, తరువాత కూడా ఉల్లి పంట పుంజుకుంటుందనే నమ్మకం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-24T11:40:00+05:30 IST