ఉల్లిపాయల పండుగ!

ABN , First Publish Date - 2020-09-07T11:04:00+05:30 IST

రకరకాల ఉత్సవాల గురించి విని ఉంటారు. ఎన్నో పండుగలు జరుపుకొని ఉంటారు. కానీ స్విట్జర్లాండ్‌లో జరిగే ఒక...

ఉల్లిపాయల పండుగ!

రకరకాల ఉత్సవాల గురించి విని ఉంటారు. ఎన్నో పండుగలు జరుపుకొని ఉంటారు. కానీ స్విట్జర్లాండ్‌లో జరిగే ఒక ఉత్సవం మాత్రం చాలా భిన్నమైంది. ఎందుకంటే ఈ ఉత్సవంలో ఉల్లిపాయలను అలంకరించి ప్రదర్శిస్తారు.

 ఏటా స్విట్జర్లాండ్‌లో ఆనియన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఉల్లిపాయలను పోలిన దుస్తులు ధరిస్తారు. ఆట పాటలతో సందడిగా గడుపుతారు. 

 ఉత్సవంలో ఎటుచూసినా రకరకాల రూపాల్లో అలంకరించిన ఉల్లిపాయలే కనిపిస్తాయి. వ్యాపారులు, రైతులు ఉల్లిపాయలను అలంకరించి ప్రదర్శనకు పెడతారు. ఈ ఫెస్టివల్‌ను చూడడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

 రకరకాలుగా అలంకరించిన ఉల్లిపాయలను కొనుగోలు చేయడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తారు. ఇక ఫెస్టివల్‌లో ఉల్లిపాయలతో చేసిన రకరకాల వంటలు నోరూరిస్తాయి.

Updated Date - 2020-09-07T11:04:00+05:30 IST