ఉల్లిరసంతో దృఢమైన కురులు...

ABN , First Publish Date - 2020-09-21T18:46:21+05:30 IST

కూరల్లో తప్పక ఉండే ఉల్లిపాయతో కురులను అందంగా, ఆరోగ్యంగా మలచుకోవచ్చు. ఉల్లిపాయ రసాన్ని వారానికి ఒకసారి జుట్టుకు రాసుకుంటే దృఢమైన, తళుకులీనే కేశాలు సొంతమవుతాయి.

ఉల్లిరసంతో దృఢమైన కురులు...

ఆంధ్రజ్యోతి(21-09-2020)

కూరల్లో తప్పక ఉండే ఉల్లిపాయతో కురులను అందంగా, ఆరోగ్యంగా మలచుకోవచ్చు. ఉల్లిపాయ రసాన్ని వారానికి ఒకసారి జుట్టుకు రాసుకుంటే దృఢమైన, తళుకులీనే కేశాలు సొంతమవుతాయి. 


అదెలాగంటే...

ముందుగా రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్‌ చేయాలి. తరువాత వాటిని మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపేస్ట్‌లోని రసాన్ని ఒక పాత్రలో వడబోయాలి. ఈ రసాన్ని మాడుకు బ్రష్‌ సాయంతో చక్కగా రాసుకోవాలి. కొద్దిసేపు మసాజ్‌ చేయాలి. గంట తరువాత నీళ్లలో శుభ్రం చేసుకొని, కండిషనర్‌ అప్లై చేయాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది. అంతేకాదు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. 


ఉల్లిపాయలో సల్ఫర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల గట్టిదనానికి అవసరమైన కెరాటిన్‌ను పెంపొందిస్తుంది. ఉల్లిరసం రాసుకోవడం ద్వారా కుదుళ్లకు రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.


Updated Date - 2020-09-21T18:46:21+05:30 IST