ఉల్లిపకోడీ(వీడియో)

ABN , First Publish Date - 2020-06-06T20:21:04+05:30 IST

మొదట ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లో తగినంత శనగపిండిని, కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు

ఉల్లిపకోడీ(వీడియో)

తయారీ విధానం: మొదట ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లో తగినంత శనగపిండిని, కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమంలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. వీలైనన్ని తక్కువ నీళ్లు పోస్తూ పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న నూనెలో మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేస్తూ బాగా వేయించుకోవాలి. అంతే కరకరలాడే వేడి వేడి పకోడీ రెడీ అవుతుంది. పకోడీని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2020-06-06T20:21:04+05:30 IST