కారు చౌకగా ఉల్లి

ABN , First Publish Date - 2020-07-04T22:09:22+05:30 IST

ఉల్లిధరలు ఎప్పుడూ ఆకాశాన్నంటుతుతంటాయి. కొనుగోలు దారుల కళ్లలో మంటలు పుట్టిస్తుంటాయి.

కారు చౌకగా ఉల్లి

హైదరాబాద్‌: ఉల్లిధరలు ఎప్పుడూ ఆకాశాన్నంటుతుతంటాయి. కొనుగోలు దారుల కళ్లలో మంటలు పుట్టిస్తుంటాయి. కానీ గత నెలరోజుల నుంచి ఉల్లిధరలు భారీగా పడిపోయాయి. రెండు నెలల క్రితం వరకూ కిలో ఉల్లిగడ్డ 40 నుంచి 50రూపాయలు పలికితే ప్రస్తుతం ఏకంగా 10 నుంచి 15 రూపాయలకు పడి పోయింది. నిజానికి ఉల్లి ధరలను కరోనాకు ముందు కకోనా తర్వాత అని చెప్పుకోవాలి. కరోనాకు ముందు అంటే మూడు నెలల క్రితం ఉల్లిగడ్డకు విపరీతమైన డిమాండ్‌. హోటళ్లు, మెస్‌లు, క్లబ్బులు, ధాబాలు ఇలా అన్నింటా ఉల్లి వినియోగం తప్పనిసరి. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి సమయంలో మాత్రం ఉల్లిధరలు పూర్తిగా పడిపోయాయి. కొనుగోలు తగ్గిపోవడంతో ధరలు కూడా పడిపోకాయి. లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లకు ఇంకా అనుమతి ఇవ్వక పోవడం, కేవలం పార్శిల్‌లకుమాత్రమే అనుమతి ఇచ్చినా దానికీ  పెద్దగా ఆదరణ లేకపోడడంతో ప్రస్తుతం హోటల్‌వ్యాపారం కూడా ఘోరంగా పడిపోయింది.


ఒక్కహైదరాబాద్‌లోనే రోజుకు 8నుంచి 12 వేల టన్నుల ఉల్లి వినియోగం అవుతున్నట్టు అంచనా. మహారాష్ట్రతో పాటు కర్నాటక, తెలలంగాణ జిల్లాల నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లిలో 60 నుంచి 70శాతం హోటల్‌వ్యాపారులే వినియోగిస్తుంటారు. మిగిలిన 30శాతం రోజువారీగా వినియోగ దారులు కొనుగోలుచేస్తుంటారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ తొలగించినా హోటళ్లు తెరుచుకోకపోవడం, పార్శిల్‌లకు ఆదరణ లేకపోవడంతో మార్కెట్‌లో భారీగా ఉల్లి నిల్వలు పెరిగిపోతున్నాయి. 


సాధారణ వినియోగ దారులు ఎంత కొన్నా టన్నుల కొద్ది ఉల్లి నిల్వలు పేరుకుతున్నాయి. దీంతో ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి 6 నుంచి 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక రిటైల్‌ వ్యాపారులు కిలో 10 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయినా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్టు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-04T22:09:22+05:30 IST