ఆనియన్ రింగ్స్

ABN , First Publish Date - 2020-10-06T20:32:55+05:30 IST

పెద్ద ఉల్లిపాయలు - 2, మైదా - ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్‌ - అర కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, ఉప్పు

ఆనియన్ రింగ్స్

కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయలు - 2, మైదా - ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్‌ - అర కప్పు, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, ఉప్పు - రుచికి, మిరియాల పొడి - అర టీ స్పూను, బ్రెడ్‌ పౌడర్‌ - ఒక కప్పు, నూనె - వేగించడానికి.


తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయల్ని అడ్డుగా తరిగి రింగులుగా విడదీయాలి. ఒక పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు, మిరియాల పొడి కలిపి తగినంత నీరు పోసి జారుగా కలపాలి. దీన్లో ఉల్లి రింగులు ముంచి బ్రెడ్‌ పొడిలో జాగ్రత్తగా దొర్లించి పక్కనుంచాలి. అన్నీ అయ్యాక నూనె తక్కువ వేడిపై ఉండగానే వేగించి తీయాలి. లేదంటే మాడిపోతాయి. వర్షాకాలం సాయంత్రం టిఫిన్‌గా టమాటో కెచప్‌తో తింటే బాగుంటాయివి.

Updated Date - 2020-10-06T20:32:55+05:30 IST