భవిష్యత్ కోసం ఆన్‌లైన్ విద్యా విధానం తప్పనిసరి: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2022-01-20T18:29:20+05:30 IST

భవిష్యత్ కోసం ఆన్‌లైన్ విద్యా విధానం తప్పనిసరని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు.

భవిష్యత్ కోసం ఆన్‌లైన్ విద్యా విధానం తప్పనిసరి: మంత్రి సురేష్

గుంటూరు: భవిష్యత్ కోసం ఆన్‌లైన్ విద్యా విధానం తప్పనిసరని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉన్నత విద్యలో కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. కేవలం తరగతి గదిలోనే నేర్చుకునే రోజులు పోయాయి, భవిష్యత్‌లో ఆన్‌లైన్ కోర్సులకు మరింత డిమాండ్ ఉంటుందన్నారు. గ్రామ స్థాయిలోనూ డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.కేవలం మౌలిక వసతులే కాదు నాణ్యమైన బోధన అందించేలా  ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేవలం నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-20T18:29:20+05:30 IST