ఆన్‌లైన్‌లో మోసపోయిన యువతీ, యువకుడు

ABN , First Publish Date - 2021-06-24T19:54:17+05:30 IST

ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన చూసి ఓ యువతి మరో యువకుడు

ఆన్‌లైన్‌లో మోసపోయిన యువతీ, యువకుడు

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన చూసి ఓ యువతి మరో యువకుడు మోసపోయారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట యువతి రూ.51 వేలను, ఆన్‌లైన్‌లో సబ్బులను కొనుగోలు చేస్తూ యువకుడు రూ.60 వేలు మోసపోయారు. బర్కత్‌పురలో నివాసం ఉంటున్న దీపక్‌కుమార్‌ అగర్వాల్‌ కుమార్తె జాలక్‌ అగర్వాల్‌ ఆన్‌లైన్‌లో ఆదిత్య బిర్లా జాబ్స్‌ ఉన్నాయని ఓ గుర్తు తెలియని మహిళ ఫోన్‌ చేసింది. జాలక్‌ అగర్వాల్‌ ఉద్యోగం కోసం రూ.51 వేలను ఈ నెల 21న చెల్లించింది. ఆ తరువాత అవతలి మహిళ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి బుధవారం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


మరో సంఘటనలో...

బర్కత్‌పురాకు చెందిన దీపక్‌కుమార్‌ కుమారుడు వరణ్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో ఇండియన్‌ ఆర్మీ సబ్బు తయారుచేసి విక్రయిస్తోందని, కొనుగోలు చేసేవారు సంప్రదించాలని ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటన చూసి ఫోన్‌ చేశాడు. తమకు 200 సబ్బులు కావాలని రూ.60 వేలు చెల్లించాడు. ఆ తరువాత ఫోన్‌ నంబర్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసపోయానని గ్రహించాడు. జాలక్‌ అగర్వాల్‌, వరుణ్‌కుమార్‌ వేర్వేరుగా కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు అడ్మిట్‌ ఎస్‌ఐ శ్రీనివాసు, నాగార్జున్‌ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-06-24T19:54:17+05:30 IST