చైనాలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ వారానికి మూడు గంటలే!

ABN , First Publish Date - 2021-09-04T06:03:48+05:30 IST

ప్రపంచాన్ని తన గాడ్జెట్లు, ‘పబ్జీ’ వంటి యాప్స్‌తో ముంచెత్తే చైనా తమ దేశంలో మాత్రం అన్నింటికీ పరిమితులు విధుస్తోంది.

చైనాలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ వారానికి మూడు గంటలే!

ప్రపంచాన్ని తన గాడ్జెట్లు, ‘పబ్జీ’ వంటి యాప్స్‌తో ముంచెత్తే చైనా తమ దేశంలో మాత్రం అన్నింటికీ పరిమితులు విధుస్తోంది. పిల్లలు ఆడే ఆన్‌లైన్‌ గేమ్స్‌ వారానికి మూడు గంటలు మించకూడదు అంటూ పరిమితులు విధిస్తోంది. ఈ మేరకు చైనా నేషనల్‌ ప్రెస్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక నోటీసు విడుదల చేసింది. పిల్లల విషయంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ కట్టడికి కృతనిశ్చయంతో ఉంది. శుక్రవారాలు, వారాంతాలు, సెలవు దినాల్లో  రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మాత్రమే మైనర్లు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం అటూఇటూగా వారానికి మూడు గంటలు లభిస్తుంది. 2019లో  ప్రకటించిన ఆంక్షల మేరకు  రోజూ గంటన్నర, సెలవు దినాల్లో మూడు గంటలకు ఈ పరిమితి ఉండేది. చైనాలో అతి పెద్ద కంపెనీలుగా ఉన్న టెన్సెంట్‌, ఆన్‌లైన్‌పై ఈ నియంత్రణ ప్రభావం చాలా ఉంటుంది. చైనాలో ఇటీవలి కాలంలో ఈకామర్స్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించారు. గత నెలలోనే ట్యూటరింగ్‌పై నిషేధం విధించి సదరు కంపెనీల రాబడికి గండికొట్టారు.

Updated Date - 2021-09-04T06:03:48+05:30 IST