స్కిల్స్‌ పెంపునకు Online learning

ABN , First Publish Date - 2021-11-23T17:37:11+05:30 IST

అంతా నార్మల్‌గా సాగుతున్న సమయంలో..

స్కిల్స్‌ పెంపునకు Online learning

అంతా నార్మల్‌గా సాగుతున్న సమయంలో సీనియర్లను పట్టించుకోని కంపెనీలు కొంచెం కష్టం వచ్చిందంటే మాత్రం వారి వైపే చూస్తాయి. ట్రబుల్‌ షూటర్ల వంటి అలాంటి సీనియర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. వీరి విలువను ఇప్పుడిప్పుడు కంపెనీలు గుర్తిస్తున్నాయి. మధ్యస్థాయి అనుభవం ఉన్న వ్యక్తులకు ఇటీవలి కాలంలో ఇంతకు ముందున్నెడూ లేనంత డిమాండ్‌ పెరిగింది. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అదనపు నైపుణ్యాలను అలవర్చుకుంటేనే వీరికి ప్రయోజనం ఉంటోంది. అంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకున్నవారే జాబ్‌ మార్కెట్లో నిలదొక్కుకోవచ్చనేది సత్యం. 


ఈ నేపథ్యంలో విచిత్రంగా సదరు నైపుణ్యాన్ని అలవర్చే కోర్సులకు డిమాండ్‌ కనిపిస్తోంది. అందుకోసం ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ వైపు ఎక్కువ మంది ప్రొఫెషనల్స్‌ మొగ్గు చూపుతున్నారు. స్కిల్‌ టాలెంట్‌ను పెంచుకునే వైపు ఇండియా కదులుతోంది. మరోవైపు తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అంతగా ప్రాముఖ్యం లేని ప్రాజెక్టులనే యాజమాన్యాలు అప్పగిస్తున్నాయి. సరికొత్త నైపుణ్యాలను సంతరించుకుంటున్న వ్యక్తులకు కొత్తతరం ప్రాజెక్టులను ఇస్తున్నారు. దరిమిలా కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఉన్న మరో మంచి ఆప్షన్‌ క్యాంపస్‌ ఆధారిత విద్య. అది కూడా అంకితభావం, మోటివేషన్‌ లక్షణాలు కలిగిన ప్రొఫెషనల్స్‌ ప్రమేయంతో రూపొందించిన కోర్సులు చేస్తే ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవచ్చు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రొఫెషనల్స్‌ కేవలం శిక్షణతో పరిమితం కారు. మంచి నెట్‌వర్కింగ్‌ అవకాశాలను ఆశిస్తారు. అలాగే వెంటనే పనిలో ఇమిడిపోయేలా ఉండే విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. అంటే జాబ్‌లో చేరగానే ప్రొడక్టివిటి మొదలు కావాలన్నమాట. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. 


ఆన్‌లైన్‌ కోర్సుల్లో ఏది ముఖ్యం అన్నది ఇంకో ప్రశ్న. అందుకు మూడు ప్రమేయాలతో సరిపోల్చుకోవాలి. 

కరికులమ్‌ డిజైన్‌ 

ఇండస్ట్రీ నిపుణులు, సీనియర్‌ అకడమీషియన్లు కలిసి రూపొందించిన కరికులమ్‌ కలిగిన కోర్సుల్లో చేరడం కష్టమే. అయితే ఇండస్ట్రీ, యూనివర్సిటీ కాంబినేషన్‌ ఉన్న కోర్సుల అందుబాటు ఒక మేర ఓకే. ఆన్‌లైన్‌ వేదికలన్నీ టెక్నాలజీ, ఫీచర్స్‌ కలగలిసి ఉంటాయి. వాటిని ఎంత బాగా ఉపయోగించుకోగలం అన్నది ఇక్క ప్రాధాన్యాంశం. మరోవైపు ఏ మేరకు అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సును అందుబాటులో ఉంచుతున్నారన్నదీ చూడాలి. అందువల్ల సాంకేతికత ఒక్కటే చూస్తే సరిపోదు. కోర్సు కరికులమ్‌ కూడా ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించాలి. 


ఆండ్రగోగి

అడల్ట్‌ లెర్నర్లకు టీచింగ్‌లో అనుసరించే విధానం అన్నమాట. ఇన్‌స్టాన్స్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ని వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోరుకుంటారు. సులువుగా సెర్చ్‌ చేసుకునేలా ఉండాలి. గ్రూప్‌ డిస్కషన్‌కు అనువుగా ఉండాలి. అప్పుడే ఒక స్థాయి ప్రొఫెషనల్స్‌ నేర్చుకోగలుగుతారు. వీడియోలు, వెబినార్లు, ఆలోచనలను రేకెత్తించే క్విజ్‌లతో లెర్నింగ్‌ మెథడాలజీ ఉండాలి. మొత్తానికి మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కలిగించేదిగా ఉండాలి. 


కార్పొరేట్‌ నెట్‌వర్క్‌

కార్పొరేట్‌ టైఅప్‌ అదే మాదిరిగా బ్రాండ్‌కు సముచిత ప్రాధాన్యం ఉంది. ఇది రెండు రకాలుగా ముఖ్యం. సరికొత్త అవకాశాలకు అనుసంధానంగా ఉంటుందా అన్నది మొదటి అంశం. కాన్సెప్ట్‌ విస్తృతికి తోడు ప్రాక్టీ్‌సకు ఉపకరిస్తుందా అన్నది  రెండో అంశం. మరో రకంగా చెప్పాలంటే నేర్చుకున్న విషయంతో నైపుణ్యపరంగా ఎదుగుదల, వర్కింగ్‌ ప్లేస్‌లో యథాతథంగా ఉపయోగానికి వీలు ఉండే స్థాయిలో ఉందా లేదా అన్నది సరి చూసుకోవడం ఇందులో ఇమిడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారంలో కొత్తగా నేర్చుకున్నది ఏ మేరకు ఉపకరిస్తుందన్నదే ప్రధాన అంశం. కొత్త ఆలోచనలను ప్రోది చేసేది కావచ్చు, లేదంటే సరికొత్త సాంకేతక సామర్థ్యాన్ని అలవర్చవచ్చు, ఏదైనప్పటికీ రియల్‌ లైఫ్‌లో దాని ఉపయోగం కనిపించాలి. అదనంగా ప్రయోజనం ఉండాలి. నేర్చుకునే క్రమం ముందు, వెనుకకు అనుసంధానమై సులువుగా పట్టు చిక్కించుకునేదిగా ఉండాలి. ఇన్‌స్టాన్స్‌ బేస్డ్‌ లెర్నింగ్‌కు చేరువుగా ఉండాలి. 


పోటీ చాలా ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో ప్రొఫెషనల్స్‌ కొత్త నైపుణ్యాలను నేర్చుకోడం తప్పనిసరి. ఐటి, నాన్‌ఐటి - రంగం ఏదైనప్పటికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే సరైన కోర్సును ఎంపిక చేసుకోవడంలోనే విజయం యావత్తూ ఉంటుంది. జాబ్‌ లెర్నింగ్‌, క్యాంపస్‌ లెర్నింగ్‌, ఆన్‌లైన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ - ఈ మూడు విధానాల్లోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వీలుపడుతుంది. వీటిలో ఏది ముఖ్యం అన్నది ఎవరికి వారు తమకున్న వెసులుబాటును అనుసరించి ఎంచుకోవాలి.






Updated Date - 2021-11-23T17:37:11+05:30 IST