ఆన్‌లైన్‌లో పీసీసీ/పీవీసీ సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2021-04-21T05:11:06+05:30 IST

ప్రజలు లేదా సంస్థలు పీసీసీ(పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌), పీవీసీ (పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికేట్‌)లు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

ఆన్‌లైన్‌లో పీసీసీ/పీవీసీ సర్టిఫికెట్లు

 వీడీయో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి

ఖమ్మం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలు లేదా సంస్థలు పీసీసీ(పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌), పీవీసీ (పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికేట్‌)లు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పోలీస్‌ వెబ్‌సైట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ- వెరిఫై ద్వారా సేవలను అందుకునేం దుకు వీలుగా అప్లికేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో, ప్రైవేటు ఉద్యోగం పొందడానికి, విదేశాలలో ఉద్యోగాలు పొంది ఆయా సంస్థల్లో చేరడానికి పీసీసీ, పీవీసీ సర్టిఫికేట్లను ఆయా సంస్థలు అడుగుతా యనీ, ఆయా సర్టిఫికేట్లు పొందడానికి గతంలో జిల్లా పోలీస్‌ కార్యాలయాలకు రావాల్సి ఉండేదని.. కానీ ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ఈ- సేవల ద్వారా పోలీస్‌ వెరిఫికేషన్‌ అవసరమైన ఏ వ్యక్తి అయినా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. అందులోనే నేరుగా ఆన్‌లైన్‌ లో చలాన్‌ చెల్లించే వెసులుబాటు కల్పించినట్టు ఆయన తెలిపారు. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత అది స్పీడ్‌ పోస్టులో గానీ, నేరుగా కానీ సంబంధిత వ్యక్తులకు అందించవచ్చని ఆయన తెలిపారు. కాగా ఆయా సేవలను అవసరమైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. 


Updated Date - 2021-04-21T05:11:06+05:30 IST