Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రెడిట్ కార్డు కేన్సిల్ చేయమంటే.. లక్ష కాజేశారు !

గుంటూరు: క్రెడిట్ కార్డు కేన్సిల్ చేయమని కాల్ చేసిన బాధితుడి నుంచి.. లక్ష కాజేసిన సంఘటన గంటూరు పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగభూషణం రెడ్డి అనే వ్యక్తి ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఎస్‌బీ‌ఐ బ్యాంక్‌లో గార్డుగా పని చేస్తున్నాడు. తనకున్న ఆర్బీఎల్ క్రెడిట్ కార్డును కేన్సిల్ చేయించుకోవాలని ఆన్‌లై‌న్‌లో కస్టమర్ కేర్ నెంబర్ చూసి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి బాధితుడికి మరో నంబర్ ఇచ్చి.. ఇంకో యాప్‌ని డౌన్‌లో‌డ్ చేయించాడు. తర్వాత చూస్తే ఇంకే ముందీ.. తన రెండు కార్డుల్లోని లక్ష రూపాయల నగదు మాయమైంది. దీంతో లబోదిబోమంటూ అర్బన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement