త్వరలో కాణిపాకంలో ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం

ABN , First Publish Date - 2022-06-24T08:02:28+05:30 IST

కాణిపాకంలో త్వరలో నూతన ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

త్వరలో కాణిపాకంలో ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం
ఆలయ పునర్నిర్మాణ పనులలో శిల్పకళను పరిశీలిస్తున్న సింఘాల్‌

దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్‌

ఐరాల(కాణిపాకం), జూన్‌ 23: కాణిపాకంలో త్వరలో నూతన ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. గురువారం స్వామివారిని దర్శించుకున్న ఆయన.. ఆలయం వద్ద జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతున్నందున్న నూతన ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీనికోసం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడానికి 9్క్ష9 సంస్థతో మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో శిల్ప కళ చాలా బాగుందన్నారు. ఈ నిర్మాణంతో ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోందన్నారు. అనంతరం అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వర స్వామి, వరదరాజ స్వామి ఆలయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిసనర్‌ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీకృష్ణారెడ్డి, రవీంద్ర బాబు, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-24T08:02:28+05:30 IST