టీకా వేసుకున్న వారియర్స్‌లో 16శాతం మందికే కరోనా

ABN , First Publish Date - 2021-05-06T08:05:40+05:30 IST

రోగులకు దగ్గరగా మసలుతున్న వారిలో కేవలం 16శాతం మందికి మాత్రమే టీకా వేసుకొన్నాక పాజిటివ్‌ వస్తోంది. ఇదే విషయమై ఢిల్లీలోని ఆస్పత్రి ఓ అధ్యయనం చేసింది...

టీకా వేసుకున్న వారియర్స్‌లో 16శాతం మందికే కరోనా

  • ఢిల్లీలోని ఓ ఆస్పత్రి అధ్యయనం

న్యూఢిల్లీ, మే 5: రోగులకు దగ్గరగా మసలుతున్న వారిలో కేవలం 16శాతం మందికి మాత్రమే టీకా వేసుకొన్నాక పాజిటివ్‌ వస్తోంది. ఇదే విషయమై ఢిల్లీలోని ఆస్పత్రి ఓ అధ్యయనం చేసింది. ఈ వివరాలు జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఢిల్లీలోని ఫోర్టిస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ డయాబెటిస్‌, మెటబాలిక్‌ డిసీజెస్‌ అండ్‌ ఎండోక్రోనాలజీ ఆస్పత్రి పరిశోధకులు.. తమ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులతోసహా అన్ని విభాగాల సిబ్బందిపై అధ్యయనం చేశారు. ఐదుగురు టీకా మొదటి మోతాదు.. 107 మంది రెండో మోతాదు తీసుకున్న వారితో కలిపి మొత్తం 123 మందిపై అధ్యయనం సాగింది. వీరిలో 15.9శాతం(18మంది)కి టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్‌ వచ్చింది. 


Updated Date - 2021-05-06T08:05:40+05:30 IST