దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-08-14T14:45:10+05:30 IST

యూఏఈ నేషనల్ క్యారియర్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దుబాయ్ ప్రయాణికులకు తాజాగా కీలక సూచన చేసింది. దుబాయ్ వీసా ఉన్న ప్రయాణికులు మాత్రమే దుబాయ్ విమానాశ్రయంలో దిగాలని పేర్కొంది.

దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

దుబాయ్: యూఏఈ నేషనల్ క్యారియర్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దుబాయ్ ప్రయాణికులకు తాజాగా కీలక సూచన చేసింది. దుబాయ్ వీసా ఉన్న ప్రయాణికులు మాత్రమే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలని పేర్కొంది. దుబాయ్ వీసా లేనివారు దుబాయ్ ఎయిర్‌పోర్టులో దిగకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దుబాయ్ వీసా కలిగి ఉండి, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) అనుమతి ఉన్నవారు మాత్రమే దుబాయ్‌ వెళ్లేందుకు అర్హులని తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ వీసా లేని యూఏఈ నివాసితులు దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావొచ్చా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఈ విధంగా సమాధానం చెప్పింది. యూఏఈ నివాసితులు ఎవరైతే దుబాయ్ వీసా కలిగి ఉండరో వారు ఎట్టిపరిస్థితిలో దుబాయ్ విమానాశ్రయంలో దిగకూడదని స్పష్టం చేసింది. అలాగే కొత్తగా రెసిడెన్సీ వీసా పొందినవారు కూడా దుబాయ్ వెళ్లడానికి వీల్లేదని పేర్కొంది.       

Updated Date - 2021-08-14T14:45:10+05:30 IST