అలా ఓడిపోవడం పాకిస్థాన్‌కే సాధ్యం: రమీజ్ రజా

ABN , First Publish Date - 2020-08-11T01:15:51+05:30 IST

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా గెలిచే మ్యాచ్ ను కాలదన్నిందని..

అలా ఓడిపోవడం పాకిస్థాన్‌కే సాధ్యం: రమీజ్ రజా

ఇస్లామాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా గెలిచే మ్యాచ్‌ను కాలదన్నిందని మండిపడుతున్నారు. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ లు ఇప్పటికే పాక్ జట్టు ఆటతీరుపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు పాకీస్థాన్ కామెంటేటర్ రమీజ్ రజా కూడా ఆ జాబితాలో చేరాడు. మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించి, రెండో ఇన్నింగ్స్ లో ఘోరంగా ఓడిపోవడం పాక్ జట్టుకే చెల్లిందని ఎద్దేవా చేశాడు.  'రెండో ఇన్నింగ్స్ లో కూడా 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 117/5 తో కుదేలైంది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 160 పరుగులు చేయాలి. ఇక పాక్ కచ్చితంగా గెలుస్తుందనే అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పాక్ బౌలర్లు చేతులెత్తేశారు.


బౌన్సర్లు వేయడమే మర్చిపోయారు. ఇక ఫీల్డింగ్ దారుణం. బట్లర్, ఓక్స్ ఇద్దరూ చక్కగా సింగిల్స్ తీసుకున్నారు. ఇద్దరికీ క్రీజులో కుదురుకునేందుకు తగినంత సమయం దొరికింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించారు. 140 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పి తమ జట్టును విజయం ముందు నిలిపార'ని రమీజ్ రజా అసహనం వ్యక్తం చేశాడు. తదుపరి మ్యాచ్ లో అయినా పరిస్థితులకు తగినట్లుగా సన్నద్ధం కావాలని సూచించాడు.

Updated Date - 2020-08-11T01:15:51+05:30 IST