సైన్స్‌ మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతుంది

ABN , First Publish Date - 2021-05-08T04:32:02+05:30 IST

మూఢ నమ్మకాలు ప్రజల ను కాపాడలేవని, కేవలం సైన్స్‌ మాత్రమే ప్రపం చాన్ని కాపాడుతుందని సామాజిక వేత్త ప్రముఖ డాక్టర్‌ మురళీధర్‌ అన్నారు.

సైన్స్‌ మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతుంది
కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ప్రారంభిస్తున్న డాక్టర్‌ మురళీధర్‌, సీపీఎం నాయకులు

- సామాజికవేత్త డాక్టర్‌ మురళీధర్‌

- సీపీఎం కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

వనపర్తి టౌన్‌, మే 7: మూఢ నమ్మకాలు ప్రజల ను కాపాడలేవని, కేవలం సైన్స్‌ మాత్రమే ప్రపం చాన్ని కాపాడుతుందని సామాజిక వేత్త ప్రముఖ డాక్టర్‌ మురళీధర్‌ అన్నారు. శుక్రవారం సీపీఎం    ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్బంగా డాక్టర్‌ మురళీధర్‌ మాట్లా డుతూ కొవిడ్‌ సామాజిక సేవా కేంద్రం పార్టీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కుంభమేళాలు, మత ప్రచారం, ఓట్ల ప్రచారం కోసం పని చేశాయి తప్ప, కొవిడ్‌ అ రికట్టడాన్ని గాలికి వదిలేసిందన్నారు. కొవిడ్‌ వ్యా ప్తి చెందినప్పుడు ఒక్క సైన్స్‌ మాత్రమే దానిని అరి కట్టగలుగుతుందన్నారు. మూఢనమ్మకాలను వదిలి మనోధైర్యంతో తగిన మందులు వాడితే కరోనా తగ్గిపోతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మాట్లాడుతూ ప్రజలకు కొవిడ్‌ కు సంబం ధించి ఏవైనా ఇబ్బందులు కలిగితే హెల్ప్‌లైన్‌ ద్వా రా తగిన సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. సీ పీఎం ఆధ్వర్యంలో జిల్లాలో ఐసోలేషన్‌ ఏర్పాటు చే యడం కోసం ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రతీ పీహెచ్‌సీలో కేవలం 50 మందికి మాత్రమే క రోనా పరీక్షలు చేయడం  దుర్మార్గమైన చర్య అని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ కొరత కూడా తీవ్రంగా ఉందని, రెండో డోసు వేసుకోవడం కోసం వేల మం ది వేచి చూస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పుట్ట ఆంజనేయులు, గోపాలకృష్ణ, కురుమయ్య, మదన్‌, నందిమళ్ల రాములు, రాము, రాబర్ట్‌, చుక్క పెంటయ్య, రాజశేఖర్‌   పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T04:32:02+05:30 IST