Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరుతడి పంటలనే సాగు చేయాలి

  •  అవగాహన సదస్సులో కలెక్టర్‌ నిఖిల

పరిగి: యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ నిఖిల సూచించారు. సోమవారం పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, యాసంగికి సంబంధించి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం లేదని, యాసంగి సీజన్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంటలైన శనగ,వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర లాభాదాయకమైన పంటలు సాగు చేసి ఆర్థిక ప్రగతిని సాధించాలన్నారు. వ్యవసాయాధికారులు బృందాలుగా గ్రామాల్లో పర్యటించి వరిసాగు వద్దని అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులు అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డిఏవో గోపాల్‌, ఏవో ప్రభాకర్‌, ఎంపీటీసీ వెంకట్‌రాంరెడ్డి, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు సుభా్‌షచందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. 

==============================================================


Advertisement
Advertisement