పాక్ జనాభాలో 3.5శాతం మందికే కొవిడ్ టీకాలు

ABN , First Publish Date - 2021-07-07T17:10:36+05:30 IST

పాకిస్థాన్ దేశం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకపడింది. ఇప్పటివరకు అతి తక్కువమందికే...

పాక్ జనాభాలో 3.5శాతం మందికే కొవిడ్ టీకాలు

ఇస్లామాబాద్ (పాకిస్తాన్) : పాకిస్థాన్ దేశం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకపడింది. ఇప్పటివరకు అతి తక్కువమందికే కరోనా టీకాలు వేశారు. కరోనా వైరస్ నిరోధానికి వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ,ఇప్పటివరకు దేశ జనాభాలో కేవలం 3.5 శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు.కరోనావైరస్ నిరోధక వ్యాక్సిన్‌కు అర్హత సాధించిన 100 మిలియన్ల మందిలో ఇప్పటివరకు కేవలం 3.5 శాతం మందికి మాత్రమే టీకాలు వేసినట్లు పాక్ అధికారులు తాజాగా వెల్లడించారు. 


పాక్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సీఓసీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై 6వతేదీ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 17,390,346 మందికి మాత్రమే వ్యాక్సిన్ లు వేశారు. పాకిస్థాన్ దేశంలో అధ్వాన పరిస్థితుల వల్ల మరో సారి అంటువ్యాధులు ప్రబలవచ్చని పాక్ వైద్యాధికారులు హెచ్చరించారు.పాకిస్థాన్ దేశంలో మొత్తం 9,64,490 కరోనా కేసులు నమోదు కాగా, 22,452 మంది మరణించారు.


Updated Date - 2021-07-07T17:10:36+05:30 IST