Saudi కీలక ప్రకటన.. ఇకపై ఆ రెండు మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి!

ABN , First Publish Date - 2021-10-10T15:00:51+05:30 IST

గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది.

Saudi కీలక ప్రకటన.. ఇకపై ఆ రెండు మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి!

రియాద్: గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆదివారం(అక్టోబర్ 10) ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.  వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.


యాత్రికులు ఎవరైతే ఇప్పటికే ఈ మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనల కోసం రిజర్వేషన్ చేసుకుని పర్మిట్ పొందారో వారు యాత్రకు 48 గంటల ముందు రెండో డోసు తీసుకున్న అనుమతి ఇస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో వారి పర్మిట్ క్యాన్సిల్ అవుతుందన్నారు. అంటువ్యాధికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు పబ్లిక్ హెల్త్ అథారిటీ(Weqaya) నిరంతర మూల్యాంకనానికి లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కనుక యాత్రికులు మసీదులకు వచ్చే సమయంలో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.    

Updated Date - 2021-10-10T15:00:51+05:30 IST