ఊరూరా సంబరం

ABN , First Publish Date - 2022-01-17T05:16:17+05:30 IST

సంక్రాంతిని జిల్లావ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. శనివారం మకర సంక్రాంతి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మూడు రోజుల పండుగ సందర్భంగా ఊరూవాడా సందడిగా మారింది. ఆటపాటలు, ఎడ్లు, పొట్టేళ్ల పోటీలు, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆబాలగోపాలం ఆనందంతో కేరింతలు కొట్టింది.

ఊరూరా సంబరం
ఒంగోలు గద్దలగుంటలో జరిగిన పార్వేట ఉత్సవంలో ఊరేగుతున్న స్వామి వారు

ఘనంగా సంక్రాంతి

ఉత్సాహంగా గడిపిన ప్రజలు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కనుమ సందర్భంగా పలుచోట్ల పార్వేటలు 

కనులపండువగా తెప్పోత్సవాలు

 ఒంగోలు, జనవరి 16 : సంక్రాంతిని జిల్లావ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. శనివారం మకర సంక్రాంతి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మూడు రోజుల పండుగ సందర్భంగా ఊరూవాడా సందడిగా మారింది. ఆటపాటలు, ఎడ్లు, పొట్టేళ్ల పోటీలు, ఇతరత్రా సాంస్కృతిక కార్యక్రమాలతో ఆబాలగోపాలం ఆనందంతో కేరింతలు కొట్టింది. ఆదివారం కనుమ సందర్భంగా పలుచోట్ల పార్వేట, తెప్పోత్సవాలు నిర్వహించారు. 



Updated Date - 2022-01-17T05:16:17+05:30 IST