మచిలీపట్నంలో ‘ఓపెన్‌ హౌస్‌’

ABN , First Publish Date - 2021-10-27T06:25:47+05:30 IST

మచిలీపట్నంలో ‘ఓపెన్‌ హౌస్‌’

మచిలీపట్నంలో ‘ఓపెన్‌ హౌస్‌’
విద్యార్థులకు ఏకే 47గన్‌ చూపిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

పోలీసు విధులు, ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 26: విద్యార్థులు  పోలీసు విధులపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. విద్యార్థులకు రకరకాల తుపాకులు, ఆయుధాలను ప్రదర్శించారు. ఆయుధాల పేర్లు, పనితీరును ఎస్పీ వివరించారు. ఆయుధాల పేర్లు, రైఫిల్‌ షూట్‌ చేయడంపై ఆరో తరగతి విద్యార్థులు చెప్పడంతో ఎలా చెప్పగలిగారని ఎస్పీ అడిగారు. పబ్జీ ఆడుతున్నామని అందుకే చెప్పగలిగామన్నారు. జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఆర్‌ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు ధర్మేంద్ర, మాసూం బాషా, రమేష్‌, విజయకుమార్‌, సీఐ అంకబాబు, ఎస్సైలు, ఆర్‌ఐలు హాజరయ్యారు.



Updated Date - 2021-10-27T06:25:47+05:30 IST