Abn logo
May 5 2021 @ 03:12AM

పేదల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలు తెరవండి

సీఎస్కు హెచ్‌ఆర్‌ఎఫ్‌ వినతి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధిత పేదల కోసం ఐసోలేషన్‌ కేంద్రాలను నెలకొల్పాలని మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎఫ్‌)  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు విన్నవించింది. హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, ఎస్‌.జీవన్‌కుమార్‌, నేతలు సయ్యద్‌ బిలాల్‌ తదితరులు సీఎ్‌సకు మంగళవారం లేఖ రాశారు. పాఠశాలలు, ఫంక్షన్‌ హాల్స్‌, క్రీడా మైదానాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చి పేదలనుఆదుకోవాలని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement