డ్రాపౌట్స్‌కు వరం ఓపెన్‌ పాఠశాలలు

ABN , First Publish Date - 2021-01-21T06:11:44+05:30 IST

మధ్యలో చదువు మానేసిన విద్యార్థులకు ఓపెన్‌ పాఠశాలలు ఓ వరం లాంటివని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి తెలిపారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను బుధవారం ఆయన పరిశీలించారు.

డ్రాపౌట్స్‌కు వరం ఓపెన్‌ పాఠశాలలు

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 4,285 అడ్మిషన్లు

ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి


పాపన్నపేట, జనవరి 20 : మధ్యలో చదువు మానేసిన విద్యార్థులకు ఓపెన్‌ పాఠశాలలు ఓ వరం లాంటివని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి తెలిపారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఓపెన్‌ స్కూల్‌ ఇన్‌చార్జి వీరేశంతో కలిసి పదో తరగతి, ఇంటర్మీడియేట్‌ ప్రవేశాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,285 అడ్మిషన్లు వచ్చాయని తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లకు ఈనెల 25 వరకు అదనపు రుసుముతో గడువు ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-21T06:11:44+05:30 IST